కంటి వెలుగు

కంటి వెలుగు:

అప్పుడే అలికినట్లు ధగధగలాడుతుంది ఆ అరుగు. అక్కడికి  ఓ కొస దూరం లో నింగి వైపు ఆశగా చూస్తున్న చిన్ని ఒక్కసారిగా ఏదో చూసినట్టుగా కేకలు వేసుకుంటూ ఇంటి దారి పట్టింది . తానూ పుట్టినప్పటినుండి చూడలేదు వడగళ్ళ వానను--అది సంగతి.

గత రెండు మూడేళ్ళుగా ఆ ఊరిలో వలసలు ఎక్కువయ్యాయి వర్షాలు పడక బీటలు వారిన భూమిని దున్నలేక వలస పోయారు చాల మంది, ఈ ఏడాదే ఎందుకో వరుణుడికి జాలి వేసినట్టు కుంభ వృష్టి కురిపించాడు ఇప్పటికి ఇది నాల్గావ సారి.  ఈ సారి వడగళ్ళతో కూడా పలకరించాడు.

రేపో మాపో ఊరి నుండి చుట్టాలు వస్తున్నారని తెలిసి ఆనందపడాలో భంగాపడాలో అర్ధం కానట్టు ముఖం పెట్టారు బసవయ్య వెంకటి దంపతులు:  ఓ పట్టాన ఆనందం కలిగినా దిగాలుగా ఉన్నారు బహుశ చిన్నిని వాళ్లతో పాటుగా పంపెయలన్న సంగతి వాళ్ళ మనసుని తోలుస్తుందో ఏమో.

ఏటి గట్టు పాయలమీద ఆడుకునే వయసు చిన్నిది ఇప్పుడిప్పుడే తనవాళ్ళని మురిపెంగా పిలుస్తోంది అలాంటి తనను వేరే ఊరికి పంపించాలా వద్దా అని సతమతం అవుతున్నారు ఇరువురు.

రాఘవయ్య గారిది చలమయ్యావాగు బసవయ్య గారిది మరుధూరిపూడి , అతను బసవయ్య కు స్వయానా పెద్దన్న అవుతాడు, వాళ్ళకి ఆ ఊరిలో ఓ మేడ ఉంది కాని అందులో ఆడుకునే వాళ్ళు ఎవరు లేరు, తనకి ఇద్దరు మగ పిల్లలే; నిజం చెప్పాలంటే వాళ్ళు వారం క్రితమే వచ్చి తనను తీస్కుని వెళ్ళానుకున్నారు కాని ఈ నైరుతి ఋతుపవనాల చేత కుదరక ఇప్పుడు వచ్చారు.

అక్కడికి బసవయ్యాకు ఎన్నో సార్లు చెప్పి చూసాడు రాఘవయ్య, కాని బసవయ్య  "చిన్ని ఇంకా పసిపాప కదా ఓ ఐదారేల్లప్పుడు పంపిస్తాలే" అని చెప్పి ఊరుకున్నా జ్ఞాపకాలు అలా తెరమరుగయ్యయో లేదో అప్పుడే బసవయ్య ఇల్లు దరి చేరుకున్నారు. పొద్దుననగా రైలెక్కింది సాయంత్రం అయ్యేసరికి చేరుకున్నారు.

ఆ ఊరిలో ఒక్క మంచి బడి లేదు ఓ పక్కా రోడ్ లేదు:ఇలాంటి పరిస్థితి  లో తనని వాళ్లతో పంపిస్తేనే బావుంటుందని అనుకున్నారు బసవయ్య దంపతులు కూడా. చిన్నిని తన సొంత బిడ్డలా సాకుతామని హామీ ఇచ్చిన మాట గుర్తుకొచ్చినా కూడా ఏదో తెలియని కలత వాళ్ళలో కనిపిస్తూనే ఉంది.

తన కన్నపేగును వాళ్ళకు దత్తత ఇచ్చెయలన్న ఆలోచనలకి సరిగ్గా నిద్ర కూడా పట్టలేదు బసవయ్యకు, అసలే చిన్న పిల్ల ఇప్పుడే ఐదేళ్ళు వచ్చాయి తను చేసే అల్లరి వీళ్ళకు నచ్చుతుందో ఏమో అని ఒకటే కంగారు తనని కంటి మీద కునుకు లేకుండా చేసింది.

తెల్లారే సరికి వాళ్ళ అన్నయ్యకు దత్తతు ఇవ్వాలనే ఆలోచన తోనే పడుకున్నాడో ఏమో కళ్ళు చమర్చాయి. కునుకు రాక ఎర్ర బడ్డ కళ్ళు చెబుతున్న నిజం అదే..

ఏటి గట్టు పాయాల మీద, పచ్చని పొలాల నడుమ , పైర గాలిలో తిరగాడిన చిన్నికి అప్పుడే ఐదేళ్ళు నిండాయని అంటే ఎవ్వరికి నమ్మశక్యం కావట్లేదు. బసవయ్య కు తన తల్లి "చిన్నితల్లి" అంటే పంచ ప్రాణాలు , తానె మళ్ళి తనకు కూతురిగా పుట్టిందని తనకు చిన్ని అని నామకరణం చేసాడు అల్లారు ముద్దుగా పెంచాడు. వెంకటి  కూడా చిన్నిని ఎంతో గారాభంగా పెంచింది, అందుచేత వాళ్ళ ఐదేళ్ళ పాప వాళ్ళకింక రెండేళ్ళ పాప లానే కనిపిస్తూ ఉంది.

ఓ వైపు తనని వాళ్లతో పంపిస్తే బాగుంటుందని తెలిసినా.. తరవాత వాళ్ళని మరిచిపోతుందేమోనన్న దిగులే వాళ్ళకు ఎక్కువయ్యింది. ఏమైతేనేం అని మరుసటి రోజు తనను బుజ్జగించి లాలించి ఎలాగోలా నచ్చజెప్పి రాఘవయ్య గారితో పంపించివేశారు.

ఒక్కసారిగా ఆ ఊరు స్తబ్దుగా ఉండిపోయింది, నిన్నటివరకు అల్లరి కేరింతలు కొడుతూ ఉన్న చిన్ని అంటే అక్కడ అందరికి వీడలేనంతగా మమకారం. ఇంకో పదేళ్ళ దాక ఇక తను తరాస పడదని తెలిసి భోరు మన్నారు బసవయ్య దంపతులు ... ఒకరి కన్నీళ్ళు మరొకరు తుడుచుకుంటూ ఒక్కరినొకరు హత్తుకున్నారు చిన్ని జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ...

పరిసమాప్తం..

ఫిక్షనల్ నెరేటివ్ స్టోరి


Popular Posts