ఉంది

చినుకులు పడుతూ ఉంటె మనసార తడవాలనుంది
చిగురాకులు గాలికి తొణికిసలాడుతుంటే వాటిల గాలి ఊయల ఊగాలనుంది
కడలి ఒడ్డున ఇసుక తెన్నేలతో ఓ గూడు కట్టలనుంది
సంద్రం లో ఎగిసే అలలా ఆకాశాన్ని ముద్దాడాలనుంది

ఆకాశం లో స్వేచ్చగా ఎగిరే గాలిపటం అవ్వలనుంది
ఎ హద్దులు లేని ప్రపంచం లోకి దూసుకేల్లలనుంది
నిండు గోదారిలా ఉరకలు వెయ్యలనుంది
నిండు మనసుతో ఆర్ద్రత కలిగిన కళ్ళలో కన్నీరు అవ్వలనుంది
చిట్టి పాపల బోసి నవ్వుల్లో ఎప్పటికి నిలవాలనుంది

ఆ జలపాతం లా కట్టలు తెంచుకు పారాలనుంది
ఆ అగ్ని అంత స్వచ్చంగా మేలిమి బంగారు వర్ణం ల మేరవాలనుంది
పారే సెలయేటి రాగం లో గొంతు కలపాలనుంది
అడ్డు అదుపులేని గాలిలా గిరికీలు కొట్టలనుంది
నీలాల నింగి అంచులు తాకి మబ్బులపై విహరించాలనుంది

చిన్నారి పాప ను తాకే తోలి తొలకరి జల్లు కావాలనుంది
కన్నులు మిరుమిట్లు గొలిపే హరివిల్లు కావాలనుంది
కన్నులలో పుట్టి పెరిగి కలతను తరిమేసే చిరు స్వప్నమై మెదలాలనుంది
పుడమి తల్లి ఋణం తీర్చుకోవాలనుంది  

Popular Posts