అలకనంద
Image Courtesy: Jason Jakober, Picasa |
నీ ప్రేమ ప్రవాహం లో ఇద్దరం మునకలేసి పదేళ్ళు దాటింది
నీ మనసు లో నాపై నిష్కల్మషమైన ప్రేమ దాగుంది అని తెలియడానికి ఇంకో ఐదేళ్ళు పట్టింది
ఈ పదేళ్ళలో మన మధ్య చిగురించిన ప్రేమపు ఏటి పాయ మండుటెండను తట్టుకోలేక ఆవిరి గా మారింది
ఈ రెండేళ్లుగా ఆ మబ్బుల్లో దాగున్న ఆవిరి చినుకు రూపం దాల్చి నన్ను చేరాలని ఆశ తో ఎదురు చూసా
పన్నెండేళ్ళ మన ప్రేమ లో నవ్వులు, కేరింతలు, ఆశలు, అడియాసలు, ఏడ్పులు తిట్లు అన్ని సమపాళ్ళలో ఉన్న
మనం నడిచిన దారిలో గులాబి రేకులు, సంద్రం కెరటాలు, నవ్వుల సుమ మాలికలు అన్ని ఉన్నాయి
వాటినే మన ఈ పన్నెండేళ్ళ ప్రేమకు అంకితమిస్తూ ఎప్పటికి నిన్ను తలుచుకుంటూ ఇలా కవితలు పేర్చాను
నీ తీరానికి నువ్వు బలవంతాన చేరుకున్నావు నన్ను మాత్రం ఇక్కడ ఒంటరిగానే వదిలేసావ్
ఐన ఇన్నాళ్ళ మన ప్రేమ ను గౌరవిస్తు నీ నిర్ణయాన్ని కాదనలేదు, ప్రేమను చంపుకోవడానికి నేనేమి పిరికి వాడిని కాదు నిన్ను మరిచిపోతానేమో కాని నా ప్రేమను ఇలా వల్లెవేస్తూ ఉంటాను నీ ప్రేమపు మాధుర్యం లో
స్నేహానికి విలువ ఇచ్చి ప్రేమకు ప్రాణం పోసి ఇవాటికి 4805 రోజులు (13 ఏళ్ళు , 1 నెల , 3 వారాలు , 6 రోజులు )