ఆ ప్రాణం నువ్వే

నిన్ను వర్ణించాలని ఎంతో తపన పడ్డాను
నిన్నెంతగా ఆరాదిస్తున్ననో నీకు తెలపాలనుకున్నాను
నిన్ను నా మదిలో ఎప్పటిలాగే నిలుపుకున్నాను
భావాల కెరటం ఈదాలని తాపత్రయపడ్డాను

తీరా ఇప్పుడు వర్ణి ద్దామంటే భావాల సుడి లో నా అక్షరాలన్నీ చిక్కుకుని
అందని తీరాలకు ఎగిరిపోయి రెండే రెండు అక్షరాలూ ఇలా మిగిలాయి
నా ఊహల్లో నిన్ను తలుచుకుని రాసుకున్న ఈ కవిత్వాన్ని చూసి మది పులకించిపోయింది
కాని భావం లేని నా కవిత కి ప్రాణం ఒక్కటే తక్కువయ్యింది ఎందుకంటే ఆ ప్రాణం నువ్వే కాబట్టి 

Popular Posts