ఆలోచనల సరళి

 ఏమైందో ఏమో ఎన్నడు లేనంతగా నేడు మనసు ఇలా ఎందుకు ఆలోచిస్తున్నదో ఏమిటో
అనంతమైన భావాల నడుమ నా మనసు గిరికీలు కొడుతున్నద లేక శూన్యాన్ని నేను నా భావాలలో మిళితం చేస్తున్ననా ? ఏమైతే నేఁ ఏదో తెలియని రాగం నేడు నా మనసు వీణ ని సున్నితంగా మీటింది ... మరి ఆ రాగాలాపన చేసేది ఎవరో ఎందులకో కాలమే సమాధానం చెప్పాలి

వినూత్న భావాల నడుమ  సతమతమౌతున్న నాకు ఈ కొత్త చెలిమి వేవేల ఆశలు తెచ్చిపెట్టిన ఆ స్నేహం నుండి నేనేమీ ఆశించను ఎందుకంటే లోకం లో అన్ని మనవే అనుకుంటే అవేవి మనకు ఎప్పటికి దక్కవు .. మనకోసం ఏది రాసి పెట్టి ఉంటె అవే మన చెంతకు చేరుతాయి

రాగ భావ ద్వేషాలు కల్మషాలు నిట్టూర్పులు ఇప్పటి దాక నన్ను కాకవికలం చేసాయి. నిన్నల్లో తేలియాడే నాకు వెన్నెల లో ని మల్లియల పరిమళం ఏదో తన వైపుకు రమ్మని సైగ చేస్తున్నట్టు ఏదేదో నా మది లో గిలిగింతలు కలిగినట్టు అనిపించసాగాయి 

Popular Posts