మైమరపు

ఊహలకే అందని ఓ మెరుపు ఇలా నా దరికి చేరుకుంటే
సన్నగా వీస్తున్న గాలి నా మదినిలా మీటుతూ ఉంటె
వెన్నెల కాంతుల్లో మనసు లీనమై ఎటో పయనిస్తూ ఉంటె
కార్చిచ్చు కూడా నిప్పుల కుంపటి వదిలి పొగగా మారి ఆ మబ్బుల్లో కలిసిపొద ?

ఎప్పుడు లేని ఏదో కమ్మని స్వరమొకటి నన్ను మైమరిపిస్తుంది
తన వెంటే రమ్మని నన్ను ఉసిగొలుపుతు ఉంది
వాన వెంట ఉరుములు మెరుపులు వచ్చినట్టు
ఆకలి తో పాటు దప్పిక నీరసం కలసి దాడి చేస్తున్నట్టు

ఏమో ఆ రాగం ఎక్కడిదో నన్ను ఓ కొత్త లోకానికి పరిచయం చేసింది
తననలా చూస్తూ ఉండిపోవాలని పిస్తుంది తనతో ఎక్కడికైనా వెళ్ళిపోవాలని పిస్తూ ఉంది
నా ఊసుల్ని పోగేసి ఈ ఊహల్లో తేలించి ఆ రాగం ఇప్పుడీ కవిత రూపం లో దాగి ఉంది
ఏమి తెలియని నాకు ఈ ప్రపంచాన్ని జయించినంత ఆనందం వస్తుంది  

Popular posts from this blog

Telugu Year Names

My Childhood and Now

మాతృమూర్తి గొప్పతనం