హృదయ స్పందన

చివురాకుల తొణికిసలాడే నవ్వు ఒకటి నన్ను తాకింది
ఎడబాటుతో సతమతమౌతున్న నాకు ఓ తాయిలం లా
వెంటాడుతున్న కల ఒకటి నన్ను నిన్నటిదాకా వదలనె లేదు
ఏమైందో ఏమో నాడు ఆకస్మికంగా భావుకతతో నిండిన హృదయం  నేడు లయ తప్పింది

చీకటి మాటున దాగిన వెలుగులా దీని అంతరార్ధం ఏమిటో కానరాక ఉంది
వేల సార్లు ప్రయత్నించా ఎక్కడ దాగుందో మరి ఆ వెన్నెల కొమ్మ
నన్ను నిలువునా తడిపిన వాననే తానూ ఆస్వాదిస్తూ ఉన్న
ఏమైందో ఏమో నాడు ఆకస్మికంగా భావుకతతో నిండిన హృదయం నేడు లయ తప్పింది

గాలి పటానికి వేగం అందితే అంతులేని ఆకాశానికి ఎగిరిపోతుంది
నిన్ను చూడాలనే ఆలోచనా నా మనసు ద్వారాలు దాటి ఎటువైపుకు పరుగులు తీసాయో
నెల రాలిన మంచు బిందువుల్ల చక్కిలిగింతలు పెట్టె రాగం ఏదో ఒకటి నన్ను తాకి ఎటో వెళ్ళింది
ఏమైందో ఏమో నాడు ఆకస్మికంగా భావుకతతో నిండిన హృదయం నేడు లయ తప్పింది
 
Popular posts from this blog

Telugu Year Names

లోలోపల