ముసుగు

కన్నులు మూసి మనసు ద్వారం తెరిచి లోపల  తొంగి చూసా
కన్నులు చూసింది చూసినట్టే ఉన్న ఆ కొలను లో బాదతాప్త అశ్రువులు పొంగి పొర్లుతున్నాయి
ఏవో ఆలోచనలు ముసిరి గొంతుచించుకుని అరచిన వినపడలేదు
ఆ ఆలోచనల మాటున ఏదో ఆవరించినట్లు ఉంది మనసంతా కాకవికలమౌతు ఉంది ముసుగు లో

బయటకు లబ్ డబ్ మంటూ  లయబద్దంగా వినిపించే హృదయ స్పందన లోలోపల మాత్రం లయ తప్పింది
ఏదో తెలియని వెలితి ప్రస్ఫూటముగా కానవస్తుంది. కోయిల కూస్తూ ఉన్న స్పందన కరువయ్యింది
వసంత మాసం ప్రకృతి ఐతే తెచ్చింది కాని మనసుకి మాత్రం గ్రీష్మ ఋతువే అన్నట్టు విలవిల్లాడుతుంది
ఆ తాపం మాటున ఏదో తెలియని గాయం రేగుతున్నట్టు ఉంది మనసంతా కాకవికలమౌతు ఉంది ముసుగు లో

ఏదో దక్కి దక్కకుండా చిక్కి చిక్కకుండా వెక్కిరించి వెళ్లినట్టు మనసు వెక్కి వెక్కి ఏడుస్తుంది
నాకు అది తెలుస్తూనే ఉంది ఆ తాపం ఆ విరహం ఆ తడి కన్నుల ఆరాటం లోలోపల మోమాటం
వెన్నెల వేడిమి లో ఎండా చలి కాస్తున్నట్టు ఏవో తారుమారు ఆలోచనలతో మనసు మనసులో లేదు
ఆ వైపరీత్యాల మాటున ఏదో వ్యాకులత దాగి ఉన్నట్టు ఉంది మనసంతా కాకవికలమౌతు ఉంది ముసుగు లో 

Popular posts from this blog

Telugu Year Names

లోలోపల