కవితంటే :

సుందర సుమనోహర సునిశిత భావాలంకృత పదబంధం
అది ఎలా ఉన్న దానిలోని అంతరాత్మ మన అంతరాలను చెరిపి వేసే ఓ అక్షర వాహిని
మదిలోని భావాలను కట్టడి చేసి ఓ దారిలో పెట్టె ఆనకట్ట
భావాలను ఏర్చి కూర్చి సమతుల్యత కలిగించే అక్షర నిధి

మదిలోని ఆలోచనలన్నీ కలగలిపి మాటల్లో చెప్పలేని దాన్ని పలకరించే పెన్నిధి
ఎన్ని జనమలైన తరిగిపోని ఎంత లోతుగా ఉన్న మదిలో తేలే కమ్మని మృదు తరంగిణి
మనిషి మస్తిష్కం నుండి వెలువడే భావ తరంగ ధ్వని
మూగాగానైన తన భాషను ఇతరులతో పలికించే స్వరాల హరివిల్లు

అన్ని కాలాలకు వసివాడని ఓ కమ్మని అనుభూతి
అన్ని కాలాల్లో ఒకేలా ఉండే ఓ అపురూప భావాల ఝరి
ఎంతటి బాధనైన తనలో ఇనుమదిమ్పచెసె ఓ రాగాలాపన భావాల మంజరి
ఎలాంటి భావాన్నైనా అలవోకగా పలకించే అలివేణి ఆణిముత్యం 

Popular posts from this blog

Telugu Year Names

లోలోపల