యశోద-కృష్ణ

మిక్కిలి కోపము అటు పిమ్మట శాంతం ఇలా నవరసంబుల సమ్మేళిత పీతవసన ప్రియ బాంధవుడు గోపికల నాయన మనోహరుండు శ్రీ కృష్ణ పరమాత్మగున్
ఇచ్చిన మాటను చేసిన బాసను మరువకన్ వెలసి వచ్చినాడు  నాడు వసుదేవుని తో కాళింది కడలిలో మమేమకమై
తన రాక తో బృందావనం వేల రెట్లు ప్రజ్వలోజ్వాల కాంతులీనుతూ మురిసెన్ లొకాలొకముల్
కాంతిని విరజిమ్ముతూ నాయనానందకరమగున్ ఆ బాలున్ని కాన వచ్చెన్ గొల్లభామల్
ఇదేట్లున్నను వెన్నలు చిలికి వన్నెల రాగం లో పిల్లనగ్రోవి తో రాగాలాపన చెయ్యుచుండేన్

పుట్టింది దేవకీ మాత ఎచటో పెరిగింది యశోదమ్మ  చెంత అలరారే శిఖిపించము
వెన్నలు చిలికిన కొంటె పనేమీ చేసినను ముద్దు మురిపెం తో మన్ననలు పొందేన్

యశస్సులు కూడగాట్టేన్ చూడరే అది ఏమి చిత్ర విచిత్రమో గాని కాళింది ఒడ్డున బృందావని లో గోపిక మనః చోరుడు
అనంత లోకాల పాలిటి సుఖఃదుఖః సమానశీలుడు మన ఎదుటే తిరిగిన ఆ గోపిలోలుడు గోపబాలుడు గోవిందుడు 

Popular Posts