వేచి ఉన్న

నా ఎదుటే ఇన్నాళ్ళు ఉన్నావు మరి నన్నెందుకు  విడిచి  వెళ్ళాలని అనిపించింది?
నిన్నాపే  ధైర్యం నాలోలేకన లేక నీ కోసం నేను నిన్ను వెతుక్కుంటూ వస్తాననా ?

ఎడారిలో మంచు బిందువులు సేకరించాలని చూసా నేను కాని ఇసుక రేణువు మధ్యలో ఇరుక్కుపోయా
నీ కోసం జాబిలి చల్లదనాన్ని వెంట పెట్టుకొస్తే వెంటనే సూర్య రశ్మికి వేడెక్కి నా ఎదనే కాల్చి వేసాయి

నీ మౌనన్ని అర్ధం చేసుకున్న నీ ఆరాటం ఏమిటో కనుగొన్న కాని మనసు మాట ఎన్నటికి వినలేక పోయా
అందేల సవ్వడిని ఆస్వాదించ నీ రాక ని గమనించి ఓ వాసంతమ మరలి రా నా వాకిట్లోకి

నవ్వులనే పుష్పాలతో అలంకరించి గుండెల కొలను నుండి నీకోసం వేచి ఉన్న చూడు
నిండు జాబిల్లి వెలుగుల కోసం కలువ భామ వేచి చూస్తున్నట్టు
 

Popular Posts