ప్రకృతి ఒడిలో ...
ఛాయ చిత్రం : మా చెల్లి ప్రియ గారి సౌజన్యం తో |
ప్రకృతి అందాలను వీక్షిస్తున్న నన్ను ఏదో జీవ రాగం పలకరించింది
అలా మేఘాల్లో తెలియాదేంత ముచ్చాతగోల్పుతూ ఉంది ఈ ప్రకృతి శోభ
చల్లని మలయమారుతం నన్ను తనతో పాటుగా ఆ కొండ కోనల్లో విహారించింది
పచ్చని చెట్టు నీడలో సేద తీరుతు ఈ అందాలు విస్తు పరుస్తున్నాయి నా కన్నుల స్పటికా లో
చల్లని ఆ ఏటి నీరు పరవళ్ళు తొక్కుతూ ఉంది మనసుని ఒలలాడిస్తూ నన్ను తాకింది
ఆ రాళ్ల రాప్పలపై నా చిరు సంతకం పెట్టాలనుంది ప్రకృతి ఒడిలో హాయిగా ఆదమరిచి నిదురొవాలని ఉంది