ఆశల కిరణం
ఇమేజ్ కర్టసీ: అల్లన్ కబ్రెర (పికాస) Image Courtesy: Allan Cabrera (Picasa) |
ఎప్పుడైతే మోడువారిన చెట్టులా నీలోని దాగి ఉన్న మెరుపు నిర్వీర్యం అవ్వుతుందో
ఎప్పుడైతే నిన్ను అన్ని వైపులా నిరాశ నిశ్ప్రుహలు కబలించి వేస్తాయో
ఎప్పుడైతే నీ కంటికి చీకటి తప్ప వేరేది ఏది కనబడలేదో
ఎప్పుడైతే నిన్ను నువ్వే అర్ధం చేసుకోలేదో
అప్పుడు మేఘం కమ్మిన ఆ చిరు చీకటిని చీల్చుకుంటూ నీ దరికి ఓ ఆశల కిరణం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది
ఎప్పుడైతే నీకు నీపైనే నమ్మకం పోతుందో
ఎప్పుడైతే నీ స్వరం నీకే వినపడదో
ఎప్పుడైతే నిండు కుండలాంటి నీ గుండెలో ప్రేమ తడి ఆవిరైపోతుందో
ఎప్పుడైతే నీ గుండె చప్పుళ్ళ అలికిడి నిన్ను తరుముకోస్తుందో
ఎప్పుడైతే నిన్ను నువ్వు అర్ధం చేసుకోలేదో
అప్పుడు మేఘం కమ్మిన ఆ చిరు చీకటిని చీల్చుకుంటూ నీ దరికి ఓ ఆశల కిరణం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది