తాడు తెగిన గాలిపటం

భావోద్వేగాల జ్వాలలు ఉద్విగ్నభరితంగ అనాలోచితంగ రేగాయి
రెక్కలు తొడిగి ఊహాలోకం లో విహరిస్తున్న నాకు చల్లని గాలి తరాస పడింది
కమ్మని ప్రకృతి అందాలు కమనీయంగా నన్ను ఒలలాడించాయి

రెప్పల మాటున చిత్ర విచిత్రాలు చోటు చేసుకున్నాయి
తెర అంటూ ఏమి లేకుండానే ఓ చలచిత్రం ప్రసారంయ్యింది
అందులో మనసు నిమగ్నమై మునకలేసి తేలుతూ ఉన్న తరుణాన
ఒక్క ఉదుటున మెలకువ వచ్చింది .. కమ్మని ఆ కల ఎటో గాలి బుడగల తాడు తెగిన గాలిపటం లా అనంతాలకు ఎగిరి పోయింది 

Popular Posts