ఏమౌతాయి
నిప్పులు కురిపించే కన్నుల్లో కన్నీళ్ళు ఉంటాయా లేకా నిప్పుల వేడిమి తాళలేక క్షణంలో ఆవిరైపోతాయా పెదవులకందని పదాలు మాటలా మెదులుతాయా లేకా మౌనాన్నే ఆశ్రయించి బేలగా మిన్నకుండిపోతాయా వెల్లువలా ఉప్పొంగే ఆశలే ఘోషగా ఎగిసిపడతాయా లేకా అత్యాశల ప్రవాహం లో కొట్టుకుని నీరుగారి పోతాయా రాగం భావం కలగల్పితే పాటగా మారి మదిని తాకుతాయా లేకా సంగీత కావ్యమై పదబంధమై గుండెతంతిను మీటుతాయా ఏ మౌ తా యి