చిరు చీకట్లు

 
చిరు చీకట్లు కమ్మినా నిశిధినా.. కాంతి పంచే వెలుగు వుంటుంది
చినుకులే ధారాపాతముగా కురిసినా.. మదిని తడిమి చల్లబరుస్తుంది
దారంతా వాగునే తలపించినా..ఇంద్రధనువు ఆకశానా ప్రస్ఫూటమౌతుంది

వెన్నెల వెలుగును చూడు నిశిధి ఎందుకు చీకటిగా ఉంటుందో తెలుస్తుంది
చల్లని చినుకులను తడిమి చూడు నీలిమేఘాల మాటునా ఉరుమెందుకో తెలుస్తుంది
పారే సెలయేటిని చూడు ఉరుకులు పరుగులతో కొండకొనలు అవలీలగా దాటేస్తుంది

నలువైపుల చీకటున్నా చమురు దీపం వెలుగు దేదీప్యమానమై వెలుగుతుంది
బీటలువారిన భూమి కూడా చిరు చినుకుతో పులకించి మెత్తబడుతుంది
సెలయేటి గలగల సంద్రంలో కూడా అలల ఉదృతిలో ఉరకలేస్తుంది


Popular posts from this blog

Telugu Year Names

లోలోపల