Posts

Showing posts from July, 2015

అ ఆ లు నాతొ ఆటలాడుకున్నాయి

అ ఆ లు నాతొ ఆటలాడుకున్నాయి పదాల కూర్పులో నా ఎదుట కవితయ్యి నిలిచినాయి  బాధగా వుంటే పదాలే తారు మారయ్యి  నవ్వు తెప్పించాయి అ ఆ లు నాతొ ఆటలాడుకున్నాయి కవితలో ప్రతి పదం మేమే అంటూ భావమై నిలిచాయి కొన్ని అచ్చులు కొన్ని హల్లులు కలగలిపి చిందాడాయి అ ఆ లు నాతొ ఆటలాడుకున్నాయి పలకలేని భాషను సైతం వాటిలో దాగి వున్నాయి పలకరిస్తే కవితల మాలలో నిగుదితమై పులకించాయి అ ఆ లు నాతొ ఆటలాడుకున్నాయి అ ఆ లు నాతొ ఆటలాడుకున్నాయి 

ద్వంద్వం

మనసులో భావం మెదిలితే.. కన్నులలో కన్నీరే చేరుతాయి ఆ కన్నీళ్ళలో కొంత ఆనందభాష్పాలు మరికొన్ని నిర్వేదపు చినుకులు మునివేళ్ళ చివర  అక్షరాలే కదులుతాయి ఆ అక్షరాల్లో కొంత పదాలు మరికొన్ని పదాలు దాగి భావమే కనిపించే ఊసులు పెదవంచున నవ్వులే పూస్తాయి ఆ నవ్వుల్లోన కొంత ఆనందం మరికొన్ని సంతోషపు ఆనవాళ్ళు   

చిరు చీకట్లు

Image
  చిరు చీకట్లు కమ్మినా నిశిధినా.. కాంతి పంచే వెలుగు వుంటుంది చినుకులే ధారాపాతముగా కురిసినా.. మదిని తడిమి చల్లబరుస్తుంది దారంతా వాగునే తలపించినా..ఇంద్రధనువు ఆకశానా ప్రస్ఫూటమౌతుంది వెన్నెల వెలుగును చూడు నిశిధి ఎందుకు చీకటిగా ఉంటుందో తెలుస్తుంది చల్లని చినుకులను తడిమి చూడు నీలిమేఘాల మాటునా ఉరుమెందుకో తెలుస్తుంది పారే సెలయేటిని చూడు ఉరుకులు పరుగులతో కొండకొనలు అవలీలగా దాటేస్తుంది నలువైపుల చీకటున్నా చమురు దీపం వెలుగు దేదీప్యమానమై వెలుగుతుంది బీటలువారిన భూమి కూడా చిరు చినుకుతో పులకించి మెత్తబడుతుంది సెలయేటి గలగల సంద్రంలో కూడా అలల ఉదృతిలో ఉరకలేస్తుంది