ఒక జంట కు పెళ్ళి జరిగిన తర్వాత నుండి ఆయా దంపతులు కలసిమెలసి ఉండాలి. కొత్త జంటలో భార్య కు తన భర్త ఉండే చోటే ఎప్పటికి శ్రేయస్కరం. పెళ్ళి జరిగిన నాటి నుండి తను పుట్టిల్లుని వదలి వచ్చే సందర్భము ఒకింత బాధాకరమే తదనుగుణంగా కొత్త జంటను ఆషాడ మాసం లో ఎవరి పుట్టింటిలో వారు ఒక నెల పాటు గడపాలని చెబుతారు. తద్వార వారిరువురికి వారి వారి జీవితాల్లో ఇరువురి ప్రాముఖ్యత తెలిసి వచ్చి ఆ బంధం చిక్కబడుతుంది. అలాగే వైవాహిక బంధంలో మరోక ప్రాముఖ్యత ఏమనంటే. వారి ఇంటి పిల్లను వారు వారి అల్లుడికి అప్పగించినాక అబ్బాయ్ అత్తారింటిలో మొదటి పండుగకు సతిసమేతంగా హాజరుకావలసి ఉంటుంది. పర్వం పరిసమాప్తమైనాక కూతురిని అల్లుడితోనే పంపించటం భావ్యం. దానికి గల కారణం. ఒకటి.. దాని వలన ఆ దంపతుల నడుమ అన్యోన్యత పదుగురికి చాటి చెబుతున్నట్టు ఉంటుంది. రెండు అమ్మాయ్ యొక్క అత్తారింటికి మరియు పుట్టినింటికి గౌరవం దక్కుతుంది. ఎలా అంటే.. ఉదాహరణ కు చైత్ర మాసం లో వివాహమైన జంటకు కొన్ని అనివార్య కారణాల రిత్య నెల పదిహేను రోజుల వ్యవధి పాటు ఒకరికొకరు దూరంగా ఉంటే గనక. మరల మొదటి సారి పండగకు దంపతులిరువురు విచ్చేసినాక గడువు ముగిసే లోపు ఆషాడ మాసం తరలి వస్తే మర...