వైవాహిక బంధం విశిష్టత

ఒక జంట కు పెళ్ళి జరిగిన తర్వాత నుండి ఆయా దంపతులు కలసిమెలసి ఉండాలి. కొత్త జంటలో భార్య కు తన భర్త ఉండే చోటే ఎప్పటికి శ్రేయస్కరం. పెళ్ళి జరిగిన నాటి నుండి తను పుట్టిల్లుని వదలి వచ్చే సందర్భము ఒకింత బాధాకరమే తదనుగుణంగా కొత్త జంటను ఆషాడ మాసం లో ఎవరి పుట్టింటిలో వారు ఒక నెల పాటు గడపాలని చెబుతారు. తద్వార వారిరువురికి వారి వారి జీవితాల్లో ఇరువురి ప్రాముఖ్యత తెలిసి వచ్చి ఆ బంధం చిక్కబడుతుంది. అలాగే వైవాహిక బంధంలో మరోక ప్రాముఖ్యత ఏమనంటే. వారి ఇంటి పిల్లను వారు వారి అల్లుడికి అప్పగించినాక అబ్బాయ్ అత్తారింటిలో మొదటి పండుగకు సతిసమేతంగా హాజరుకావలసి ఉంటుంది. పర్వం పరిసమాప్తమైనాక కూతురిని అల్లుడితోనే పంపించటం భావ్యం. దానికి గల కారణం. ఒకటి.. దాని వలన ఆ దంపతుల నడుమ అన్యోన్యత పదుగురికి చాటి చెబుతున్నట్టు ఉంటుంది. రెండు అమ్మాయ్ యొక్క అత్తారింటికి మరియు పుట్టినింటికి గౌరవం దక్కుతుంది. ఎలా అంటే.. ఉదాహరణ కు చైత్ర మాసం లో వివాహమైన జంటకు కొన్ని అనివార్య కారణాల రిత్య నెల పదిహేను రోజుల వ్యవధి పాటు ఒకరికొకరు దూరంగా ఉంటే గనక. మరల మొదటి సారి పండగకు దంపతులిరువురు విచ్చేసినాక గడువు ముగిసే లోపు ఆషాడ మాసం తరలి వస్తే మరో నెల పదిహేను రోజులు అమ్మాయ్ అబ్బాయ్ వారి వారి పుట్టింటికే పరిమితం అవ్వ వలసి ఉంటుంది. ఇదీ అనివార్యమే. అనక అమ్మాయ్ వారి అత్తారింటిలో అడుగు పెడుతూనే మరల వచ్చే పండుగకు పిలుపు వస్తే అమ్మాయ్ వారి అత్తింటివారు ససేమిర పంపకూడదు. ఎందుకనంటే దాని వలన ఇరు పెద్దలకి పరువు నష్టం. కారణం మన ప్రతి కదలికను లోకులు వివాహ వేడుక ముగిసిన వేళ నుండి గమనిస్తుంటారు. కొత్త జంట కాపురం మొదలు నుండి ప్రతి విషయం వారికి ఇరుగు పొరుగు ద్వార తెలుస్తూనే ఉంటుంది. అలాటి పక్షాన ఆషాడ మాసం ముగించుకుని అత్తారిల్లు చేరుకున్న పడతి మరల మూడు నాలుగు మాసాల పిమ్మట తన భర్త తో పాటే తన పుట్టింటికి రావలసి ఉంటుంది. లేదా అదృష్ట వశాత్తు తాను గర్భం దాల్చితే భర్తయే దగ్గరుండి తన అత్తమామలకు కబురంపి తనని వారితో కొద్ది నెలల పాటు బాగోగులు చూసుకోవాలి. కేవలం ప్రతి పండుగకు హాజరు కావటం వలన పరువుకు భంగం ఏర్పడుతుంది ఎందు చేతనంటే.. భార్య తన పుట్టింటివారు పిలుపునందించే ప్రతి పండుగకు హాజరయ్యే సమక్షాన లోకులకు రెండు విధాల అనుమానం వచ్చే అవకాశం పుష్కలంగా ఉంటుంది.. ఒకటి.. అబ్బాయ్ కి లేదా అమ్మాయ్ కి ఆయా పెళ్ళి వారిరువురి ఇష్టానికి వ్యతిరేకమేమో అందుకే పుట్టింటికి వచ్చేయాలనే తపన ఉందనుకుంటారు. లేదా.. అత్తారింటివారికెవరికి ఆ పిల్ల పట్ల ఎటువంటి మమకారం లేకనే ఆ భార్య పుట్టింటి వారు పిలుపు అందిచిన వెంటనే పంపటానికి సమ్మతిచ్చినట్టు గోచరిస్తుంది. అమ్మాయ్ కి పెళ్ళి ఐన రోజునుండి అత్తారిల్లే సర్వస్వం. సంవత్సరానికి ప్రతి పండుగకు కాకుండ ఒక యేడాది సంక్రాతికి మరో యేడాది ఉగాదికి. ఆపై మరో యేడాది దసరకు భర్తతో పాటు భార్య తన పుట్టింటికి వెడితే ఆ జంట లోకుల దృష్టిలో, అత్తారింటి దృష్టిలో, పుట్టిింటి దృష్టిలో అన్యోన్యతకు మారుపేరులా కలకాలం వర్ధిల్లుతారు.

Popular posts from this blog

Telugu Year Names

లోలోపల