Skip to main content

Posts

Showing posts from September, 2025

మహా గణపతి

 రోజువారి దైనందిన జీవితాన పుజలు పురస్కారలు కాస్త ఆటవిడుపు ఉరుకులు పరుగులు నిండిన జీవితాన ఉత్సవాల మేలుకొలుపు ఆత్మీయ పలకరింపు నిత్యం దీప ధూప నైవేద్యాదులతో ఎవరికి వారే పూజిస్తున్న వేళ సకుటుంబ సమేతమై జనవాహినిలో మూడేళ్ల కిందట మొదలాయే గణపతి హేల ప్రతి యేట నూతనోత్సాహం మనందరికి ఆశిస్సులే ప్రోత్సాహం దేవాగ్రగణ్య పూజిత అంబాసుత జై మరల వేచి చూసేము నీ ఉత్సవానికై ~శ్రీధర్ భూక్య