Ninna Nedu Repu
నిన్న ఓ కరిగిపోయిన కమ్మని కల నేడు ఓ చెదిరిపోని కర్తవ్యాల వల రేపు ఓ మధురనుభుతినిచ్చే వెల్లువ ఆ ప్రవాహం ఎప్పుడు మన ఎదుటికి రానే రాదు నిన్నటి ఆ స్వప్నాన్ని ఎన్నాలని గుర్తుచేసుకు ఉంటాము రేపటి మన ఆశలకి ఆశయాలకి నేడు ఓ పునాది అవ్వాలి నిన్నలో జరిగిన వన్ని మన మంచికని అనుకోని రేపటికి ముందు అడుగువేసుకు పోవడమే మానవ లక్షణం చిరునవ్వు చెదరని మోమును చూస్తూ ఉంటె మనసు ఉప్పొంగి ఉల్లాసంగా పరుగులు తీస్తూ ఉంటుంది అదే మన కళలను సాకారం చేసే విజయ వారధి మన రేపటికి మనతో ఎప్పటికి నిలిచి పోయే పెన్నిధి