దొంతెర

అల నేను నిదురించడానికి ఉపక్రమించానో లేదో.. ఉన్నటుండి ఏవో జ్ఞాపకాల దొంతెరాలు నా కనుల ఎదుట సాక్షాత్కరించాయి.. నిన్నటి ఆ రోజులు ... ఆ ముభావమైన స్వభావాలు ... భావం లేని రాగాలు ... రాగం లేని రాగ ద్వేషాలు ... ద్వేషం లేని కల్మషాలు... కల్మషం లేని ఆప్యాయతలు... ఆప్యాయత మరిచిన ప్రేమలు... అన్ని.. అల అల ...

ఇన్నేళ్ళలో ఎప్పుడు అనిపించలేదు నాకెపుడు కాని తోలి సారిగా అప్పుడు ఎందుకు అనిపించిందో ... నాకైతే అసలు తెలియనే తెలియదు.. తెలిసి తెలియని వయసు లో మొదలయ్యేది ఒకటి ఉందని తెలిసిన ... ఆ భావన అదేనా కాదా అని మనసు లో సమస్య పూరణం చేసుకునే ఇప్పటి లాంటి రోజులు కావవి ...

ఎప్పుడు లేనంతగా ఎందుకో నాకు అల అనిపించింది ... కాని చెప్పడానికి మాటలు చాలక ... విన్నవిన్చుకోవడానికి మనసు ఒప్పక అంతర్మథనం చేసుకున్న క్షణాలవి ... రోదసిని దాటి రోడించాలనిపించిన ఎందుకో నాకప్పుడు ఏమి అనిపించలేదు ....

ఆ భావన కలిగి నేటికి పన్నెండేళ్ళు సంపూర్ణమైన ఇప్పటికి మొగ్గ తొడిగిన కలువ రేకుల్ల ... హొయలు పోతున్న జలపాతం ల .. ఆకాశాన మెరిసే తార ల మిణుక్కు మిణుక్కు మంటూ ఓ చల్లని దీపం ప్రజ్వలిస్తుంది.

నా కంటికి ఆ ఉప్పెన కూడా మానవత్వం కలిగిన మనిషి లానే అనిపిస్తూ ఉంది ... తనని ఒడ్డు నుండి నడికి లాగుతున్న ... ఎగిసి పది కెరటం మల్లి ఒడ్డు కే చేరుతుందని అనుకుంటుండగా ఏదో చప్పుడయ్యింది ...
ఉదయం ఎప్పుడో నిన్నటి ఆ నల్లని జ్ఞాపకానికి సెలవు చెప్పి తనతో పాటుగా తెచ్చిన రంగుల కుంచె తో ఆ నింగిని సైతం ఓ జీవం ఉన్న చిత్రం ల మలిచింది ... అది చూసి ... నిన్నటి ఆ చేదు  జ్ఞాపకానికి వీడుకోలు పలుకుతూ ... నా మనసు ఉలిక్కి పడి లేచింది... తనతో పాటు తన ఆలోచన సరళిని సవరించు కొని మానవత్వం కలగలుపుకొని జీవితం లో ఎప్పుడు ఇలాంటివి ఎదురైనా దీటు గ ఎదుర్కొనే శక్తిని ప్రసాదించింది...!

Popular posts from this blog

Telugu Year Names

My Childhood and Now

మాతృమూర్తి గొప్పతనం