కురిసే మేఘం
Image Courtesy: Flickr చిరు చినుకుల సాయంత్రం దోసిలిలో ఒక్కో ముత్యాన్ని పడుతూ నిలువునా తడుస్తూ ఆ తుప్పరలో నన్ను నేనే మరిచిపోతూ పరిగెత్తుకుని వెళ్లి నీటిమీద పడవలు చేసి పారించాను నీలి మేఘాల సవ్వడిలో మెరుపుతీగలా హొయలుబొతు ఆ చిరు చినుకుల వరదలే అనుపమానంగా ఎగసే అలలై ముచ్చాతగోలిపాయి నా నందనవనాన్నే చక్కగా అలంకరించాయి చల్లని గాలి చెవులలో చేరి శంఖము పూరించినా ఆ తెలియని హాయేదో నా లోలోపలా కదలాడింది నీలి నయనాలలో ఏదో తెలియని వెఱ్రితనం నన్ను ఓ చోట నిలవనీకా గాలిలా చినుకుల్లో తడపసాగింది నిండు కుండలో గోదారిని పట్టి నెత్తిన బోర్లించినట్టు