|
Indicative Image Only |
ఒకె లగ్నం లో
ఇరు మనసులని
మూడు ముళ్ళ బంధంతో
నాలుగు వేదాల మంత్రోపచారణతో
పంచ భూతాల సాక్షిగా
ఆరు ఋతువుల్లో కలిసిమెలసి ఉండాలని
సప్తపదులు వెంట నడయాడగ
అష్టైశ్వర్యాలు సిద్ధించాలని
నవరసాలు తమ సంసారం లో నిండాలని
పది కాలాల పాటు కష్ట సుఖాలు పంచుకునె బంధమే
పెళ్ళి