కురిసే మేఘం

Image Courtesy: Flickr

చిరు చినుకుల  సాయంత్రం 
దోసిలిలో ఒక్కో ముత్యాన్ని పడుతూ 
నిలువునా తడుస్తూ ఆ తుప్పరలో నన్ను నేనే మరిచిపోతూ 
పరిగెత్తుకుని వెళ్లి నీటిమీద పడవలు చేసి పారించాను 

నీలి మేఘాల సవ్వడిలో 
మెరుపుతీగలా హొయలుబొతు 
ఆ చిరు చినుకుల వరదలే అనుపమానంగా 
ఎగసే అలలై ముచ్చాతగోలిపాయి నా నందనవనాన్నే చక్కగా అలంకరించాయి 

చల్లని గాలి చెవులలో చేరి శంఖము పూరించినా 
ఆ తెలియని హాయేదో నా లోలోపలా కదలాడింది 
నీలి నయనాలలో ఏదో తెలియని వెఱ్రితనం నన్ను ఓ చోట నిలవనీకా 
గాలిలా చినుకుల్లో తడపసాగింది నిండు కుండలో గోదారిని పట్టి నెత్తిన బోర్లించినట్టు  

Popular posts from this blog

Telugu Year Names

లోలోపల