Skip to main content

Posts

Showing posts from November, 2014

ఎచటికో నా పయనం

2007-2014 Kaavyaanjali ఎచటికో నా పయనం ముళ్ళ బాట అని తెలిసినా కారు మేఘాలే ఉరిమి పడుతున్నా నదిలా మారి నా అంతం సముద్రమని తెలిసినా ఎచటికో నా పయనం కంచె వేసి గుండెను గాయపరచినా ఊపిరి బిగపట్టి నిట్టుర్పుల సెగలై ఆశలు కాలిపోతున్నా సెగను తాకి ఆవిరి మెఘమై చిరుజల్లులై పుడమిలొ కలిసిపోతానని తెలిసినా ఎచటికో నా పయనం భావాలు మైనమై ఆవేదనతో కరిగిపోతున్నా నన్ను నన్నుగా ప్రేమించే వారికోసం డివిటిలా మారి వెలిగి పోతున్నా స్వచ్చమైన స్నేహానికి ప్రతీకగా బండబారిన హృదయం పై శిలాక్షరమై మిగిలిపోతానని తెలిసినా [నా ఈ కావ్యాంజలి బ్లాగ్ నేటితో ఏడూ వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ తరుణాన ఈ కవిత ]

వాలుచూపులు వేచి వీక్షిస్తున్నాయి

నిజం నిప్పని నింగిలో నిగారింపు నీలవర్ణాల నిండు నెలవంక  దరికిరాక దాపరికాలు దోబూచులాడే దిక్కులవెంట  కరిగే కన్నీరు కలతలను కొలిచేవా కనులకు కానవచ్చే కమ్మని కలలా  గతి గమనం గోచరించి గాలిసైతం గగనానికేగి గింగిరులుకోడుతుంటే  తదేకంగా తపనతీరక తనువంతా తిమిరాన్ని తచ్చాడుతుంటే తాత్పర్యాలు తెలియక తికమకలో  రాగద్వేషాలు రంగరించి రేయిని రంగులద్ది రకరకాలుగా రూపుదిద్దుకున్న వెతికే వాలుచూపులు వేచి వీక్షిస్తున్నాయి వరాల వాన వస్తుందని విరబూసే వెలుగుపులు వసంతానికి విన్నవించటానికి వీనుల విందుగా వినటానికి