వాలుచూపులు వేచి వీక్షిస్తున్నాయి
నిజం నిప్పని నింగిలో నిగారింపు నీలవర్ణాల నిండు నెలవంక
దరికిరాక దాపరికాలు దోబూచులాడే దిక్కులవెంట
కరిగే కన్నీరు కలతలను కొలిచేవా కనులకు కానవచ్చే కమ్మని కలలా
గతి గమనం గోచరించి గాలిసైతం గగనానికేగి గింగిరులుకోడుతుంటే
తదేకంగా తపనతీరక తనువంతా తిమిరాన్ని తచ్చాడుతుంటే తాత్పర్యాలు తెలియక తికమకలో
రాగద్వేషాలు రంగరించి రేయిని రంగులద్ది రకరకాలుగా రూపుదిద్దుకున్న
వెతికే వాలుచూపులు వేచి వీక్షిస్తున్నాయి వరాల వాన వస్తుందని విరబూసే వెలుగుపులు వసంతానికి విన్నవించటానికి వీనుల విందుగా వినటానికి