ఎచటికో నా పయనం


2007-2014 Kaavyaanjali
ఎచటికో నా పయనం
ముళ్ళ బాట అని తెలిసినా
కారు మేఘాలే ఉరిమి పడుతున్నా
నదిలా మారి నా అంతం సముద్రమని తెలిసినా

ఎచటికో నా పయనం
కంచె వేసి గుండెను గాయపరచినా
ఊపిరి బిగపట్టి నిట్టుర్పుల సెగలై ఆశలు కాలిపోతున్నా
సెగను తాకి ఆవిరి మెఘమై చిరుజల్లులై పుడమిలొ కలిసిపోతానని తెలిసినా

ఎచటికో నా పయనం
భావాలు మైనమై ఆవేదనతో కరిగిపోతున్నా
నన్ను నన్నుగా ప్రేమించే వారికోసం డివిటిలా మారి వెలిగి పోతున్నా
స్వచ్చమైన స్నేహానికి ప్రతీకగా బండబారిన హృదయం పై శిలాక్షరమై మిగిలిపోతానని తెలిసినా


[నా ఈ కావ్యాంజలి బ్లాగ్ నేటితో ఏడూ వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ తరుణాన ఈ కవిత ]

Popular Posts