Posts

Showing posts from September, 2020

ఏమి ఇచ్చుకోగలను కృతజ్ఞత తప్ప

 నేను పుట్టిన ఊరు నన్ను మూడేళ్ళు సాకితే.. నన్ను పెంచిన ఊరు ముప్పై ఏళ్ళు సాకింది.. ఏమిచ్చి ఋణము తీర్చుకోగలను వైజాగపటమా..! చదువు సంస్కారం నేర్చుకున్నది ఈ వైశాలినగరములోనే..!! మర్యాద గౌరవం పొందింది ఇక్కడే.. సొంతిల్లు నేను పుట్టిన ఊరిలో కట్టించుకున్నాము దాని మూలానా నా వివాహనంతరం అక్కడే బస చేయాలని తీర్మానించుకున్నా గాని, మనసొప్పకా గడచిన రెండున్నరేళ్ళు  కూడా వైజాగపట్టినములో ఉన్నాము.. నాన్న గారికి మరో ఐదేళ్ళ ఐదు మాసాల తరువాయి రిటైర్మెంట్ గనుక వారు సొంతింటికి రాలేని పరిస్థితి.. బాడుగా కి ఇస్తే కష్టపడి కట్టుకున్న ఇంటిని ఎలా ఉంచుతారో తెలియని అనిశ్చితి.. గనుక నేను తప్పనిసరిగా సతి సమేతంగా సొంత గూటికి చేరే సమయం ఆసన్నమయ్యింది.. కాకపోతే అందరు క్షేమంగానే ఉండాలని నా మనఃసాక్షి తో మనఃపూర్వకంగా కోరుకోవటం తప్ప ఏమి ఇచ్చుకోగలను..! 

ఎటు తేల్చని సంధిగ్దత

 భార్య పిల్లలు ఒక చోట భర్త మరోచోట తనకు తానుగా ఊరేగి వెళ్ళింది భార్య వ్యత్యాసాలకు తావు యిచ్చే విధముగా నాలుగున్నర మాసాల యెడబాటు యింటి యిల్లాలిని యేలుకోవాలని తపన మొండి ఘటానికి లేదు రాదు ఆలోచన నను నా వాళ్ళకు దూరం పెట్టాలనే వారి యాతనో యిల్లు బాడుగలో భార్య మడుగులో భర్త అయోమయంలో రేపటి జీవితానికి నాకే నన్ను శత్రువు చేసే యోచన విధి రాత యే మలుపు తిరిగేనో తెలియని ఆవేదన కనిపెంచిన తల్లిదండ్రులు తల్లడిల్లే ఓ వైపు కట్టుకున్న భార్య కన్న బిడ్డ ఆవేశం ఓ వైపు తల్లడిల్లుతున్న మనసు ఎటు తేల్చుకోలేక కోవిడ్ మహమ్మారి ఆనాటికి ఎంతగా పెరిగేనో తెలియక 14 Jun 2020~13 Jul 2020 14 Jul 2020~ 13 Aug 2020 14 Aug 2020~13 Sep 2020~ 09 May 2020~08 Jun 2020 09 Jun 2020~08 Jul 2020÷ 09 Jul 2020~08 Aug 2020 09 Aug 2020~08 Sep 2020 09 Sep 2020~ 08 Oct 2020 ~ 09 Oct 2020~08 Nov 2020 09 Nov 2020~08 Dec 2020 09 Dec 2020~08 Jan 2021* 09 Jan 2021~08 Feb 2021