Posts

లోలోపల

 బయిటి వారితో కాదు. మనవారి తో మన సమక్షాన మంథనాలు. మంచిని పంచుకోగలం.. కాని.. కాలం చేసే గాయాలను అర్ధం చేసుకునే ఔనత్యం ఎవరికుంది ఈ రోజుల్లో.. లోలోపలే కుమిలిపోవటం తప్ప.. అది కనికట్టని తెలిసీ కూడా.. మనవారు ఎలా స్పందిస్తారో తెలియని నిర్వేదపు సూచన.

నేటి తీరు

 అందరు అనుకుంటారు.. 'వీడికేంటి సరదాకి సెలవులు తీసుకుంటాడు. రోజంత ఎక్కడో గడిపి వస్తాడు.. పైగా రెండు మూడు రోజులు వరుస సెలవులు' అని కాని.. ప్లానింగ్ వాళ్ళది, ఎక్జిక్యూషన్ మాత్రమే నాది. ఇబ్బంది నాకు ఆటవిడుపు వారికి. ఖర్మ రా బాబు.. ప్చ్.. నాలోనే నేను ఎవరికి ఎదురు చెప్పలేక సతమతమవూతూ ఉంటాను..! దానికి తోడు ఒక్కో సారి ఒక్కో ఘటన.. నిన్న మా పాప సైకిల్ తొక్కుతు అదుపు తప్పి ముఖం పై రక్కుకు పోయింది. ప్చ్.. నాకే ఎందుకిలా!!

la vida la tempo

 o tempo viaja mais rápido que a vida, mas a vida é mais curta que o tempo.

Your Happiness Your Way

 Rekindle Happiness from your own self, you cannot find happiness outside your own self. Happiness is intertwined with Peace and Tranquility.

కలలు

 నాకు సైతం కలలు, ఆశలు, ఆశయాలు ఉన్నాయి. నాకు సైతం ప్రేరణ, ప్రోద్బలం, ప్రోత్సాహం కావాలి. నాకంటు ఉనికి ఒకటి ఉంది. దానికి సారూప్యత కావాలి. రెప్ప పాటు కాలానికి నాకంటు కాస్తంత ఆటవిడుపు కావాలి  నా జన్మ ఒక్కటే, నా మంచి కోరేవారు ఇద్దరే. తక్కిన వారు నా వెనక చూసి అంచన వేసి దానికణుగుణంగా నడుచుకునే వారు నీ కష్టం వాడుకునే వారికి నీ ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేదు నీకు తోడు నిలవాల్సిన వారే నీకు వెన్నుపోటు పొడవటానికి వెనుకాడరు 

జీవిత యుద్ధం

 జీవతం నిరంతరమైన యుద్ధం అందులో నెగ్గటం కంటే పోరాట పటిమ ముఖ్యం. నిత్యం ఎన్నో అవాంతరాలు సవాళ్ళు ఎదురవుతూనే ఉంటాయి. ఓర్పు నిన్ను రణస్థలాన నిర్వీర్యం కానిక కాపాడుతూనే ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత

ఆవేదన

 మంచివానికే మనసు విరిచే వారు దొరూకుతారు. ఎందుకంటే వారిని ఓర్పుతో భరించాలి. మరొకరు సైతం అలా ఉంటే అది ఎటో మలుపు తిరిగి వినాశనానికి దారి తీస్తుంది. అంచేతనే ఓర్పు, సహనం కలవారికే బాధలు బాధ్యతలు ఎక్కువ.. ఓర్చుకుంటారని