కలలు
నాకు సైతం కలలు, ఆశలు, ఆశయాలు ఉన్నాయి.
నాకు సైతం ప్రేరణ, ప్రోద్బలం, ప్రోత్సాహం కావాలి.
నాకంటు ఉనికి ఒకటి ఉంది. దానికి సారూప్యత కావాలి.
రెప్ప పాటు కాలానికి నాకంటు కాస్తంత ఆటవిడుపు కావాలి
నా జన్మ ఒక్కటే, నా మంచి కోరేవారు ఇద్దరే. తక్కిన వారు
నా వెనక చూసి అంచన వేసి దానికణుగుణంగా నడుచుకునే వారు
నీ కష్టం వాడుకునే వారికి నీ ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేదు
నీకు తోడు నిలవాల్సిన వారే నీకు వెన్నుపోటు పొడవటానికి వెనుకాడరు