చెరో ఇద్దరన్నయల గారాల చెల్లెళ్ళతో నాకొచ్చింది తంట ఒకరితో మాటలాడితే మంట మరొకరితో మాటలాడకపోతే మంట ఒకరిని అక్కున చేర్చుకోవాలంటే బెంగ మరొకరిని అక్కున చేర్చుకోవేమని బెంగ పిల్లల బాగుకై ఒకరినొదులుకోలేను మరొకరితో సాంగత్యం కాదనలేను ఎనిమిదేళ్ళ బంధం ఒకరితో రెండేళ్ల సావాసం మరొకరితో కట్టుకున్న దానికి దగ్గర కాలేను మరొకరికి దూరం కాలేను తన దగ్గర కెడితే వాత ఈమే దగ్గర లేనని మోత ఇద్దరు ఆగంతగులే నాకు ఒకప్పుడు ఒక్కరు చాలా దగ్గర మరిప్పుడు అర్థం చేసుకోలేక ఒంటరిని ఇక్కడ దరికి చేరలేక ఒంటరి తానక్కడ నూట నలభై మూడు కిలోమీటర్ల దూరం సున్నితమీ బంధాల దారం
మదిని సుతిమెత్తగా మీటే భావాల మజిలి