Posts

వివాహ బంధం

చిన్ని జీవితంలో ఏమరుపాటులో తెలిసో తెలియకో పోరపాట్లు సంభవించటం కద్దు.. అటు పిమ్మట వాటిని మన్నించి మంచిగా మసులుకోవటంలోనే ఉంటుంది ఏ బంధానికైన విశిష్టత సంసార బంధం సజావుగా సాగాలంటే అపుడపుడు అలకలు విభేదాలు మనఃస్పర్ధలు సహజం, వాటిని అధిగమించినపుడే ఆ బంధానికి సార్థకత

బావి సంద్రం

ఊట బావిలో నీరు ఊరాలంటే తడి చినుకు తప్పనిసరి. ఆ తడి చినుకు కురవాలంటే సంద్రంలోని నీరే ఆవిరవ్వాలి.

50th Day

సప్తవర్ణాలన్ని కలగలిపి చిరుచినుకుల చిటపట హోరులా అష్టైశ్వర్యాల అష్టలక్ష్మీ స్వరూపమే మువ్వలు గట్టి నడయాడ ఉంగా ఉంగా మొదలుకుని  ముదుముదు మాటల మూటగా నాన్నకుచి అమ్మకుట్టి నానమ్మ తాతయ్యల ఆశిర్వచనాల గారాలపట్టిగా సంతోషాలన్ని తన చిన్ని పిడికిలిలో బంధించిన ఆత్మికయై నవరాగాల సమ్మిలిత భావోద్వేగానికి మమల్ని లోను జేసి మా ఇంట కొలువు దీరిన కనకదుర్గక్క చల్లని దీవెనగా ఈ శ్రీధరనితల కంటిపాపగా ఏడుకొండల ఆసామి అభయమై నవ్వుల పువ్వులు పూయిస్తు తన ఇద్దరు మేనత్తల మేనకోడల్ చూచూలు

మూర్ఖత్వం

ముర్ఖత్వమనే గొడుగు కంటే ఆప్యాయత అనే మబ్బులు అపారమైనవి. గొడుగుకు చిల్లుపడితే తడిసిపోవటం ఖాయం.. మేఘానికి చిల్లుపడితే తడసిపోవటం ఖాయం.. ఎలా చూసినా చివరాఖరి గెలుపు క్లౌడ్ దే..

తేడ

మీవారు మీపై అమితమైన ఆప్యాయతను కురిపిస్తుంటే ఆ తడిజల్లుల్లో తడవండి.. మూర్ఖత్వమనే గొడుగును విప్పదీసి అనురాగాత్మీయతకు విఘాతం అంతరాయం కలగించకండి.

అసలైన వారు

మీకంటే ఈ లోకం మొత్తంలో మిమల్ని అమితంగా అభిమానించే వారని తెలిసి కూడా వారి మనసుని గాయపరచవచ్చనే ఆలోచన చేయ్యవద్దు, ఆ స్వచ్ఛమైన మనసులో ఆదరించే సత్తువ తగ్గుముఖం పట్టదు, ఆ నిఃస్వార్థ ప్రేమాభిమానాల ముందు ఎదుటివారి గీర బలుపు పొగరు టెక్కు పటాపంచలే. అందరిది మానవ జన్మే..!

ఆప్యాయత

మీవారు మీపై అమితమైన ఆప్యాయతను కురిపిస్తుంటే ఆ తడిజల్లుల్లో తడవండి.. మూర్ఖత్వమనే గొడుగును విప్పదీసి అనురాగాత్మీయతకు విఘాతం అంతరాయం కలగించకండి.