ఓ వింత కథ

ఐతే ఇప్పుడొక చిన్న కథ.. 
మరి కథ అనగానే అనగనగ అనగనగ అంటూ మొదలు పెడతాను అనుకున్నారు కదా .. కాని అలా కాదు 
ఇది కథ కాదుగా మరి..  మరి కథ కాని కథకు కథ అని ఎందుకన్నట్టు ఏమోలే నాకేం తెలుసు 
మనసు బాగోలేకుంటే కథ,  మనసు ఉల్లాసంగా ఉండాలంటే కథ,  అంటూ వింటూ ఉంటాం కదా అని ఈ కథ..!  

'బాబు..  కథ కథ  అంటున్నావు తప్పితే కథ ఏమిటసలు..'  అనే కదా  సందేహం.. వస్తున్నా అక్కడికే వస్తున్నా .. 
జరా కాస్త చోటిస్తే మీ అందరి మధ్య లో కుర్చుని చెబుతా .. అలా అని నన్ను మధ్య లో పెట్టి కుమ్మెయొద్దు సుమీ.. కథ అడ్డం తిరుగుద్ది. 'అబబ్బబా మళ్ళి  కథ అంటున్నాడు కాని కథ ఏమిటో చెప్పకుండా వున్నాడేంటి  చెప్మా అనే కదా.. ఆగండాగండి ఇదుగో కథను విని నిలబెట్టాల్సిన బాధ్యతా మీదే  నా  పూచి ఏమి లేదు వింటున్నారా (ఐన ఎలా వింటారు, తిలకిస్తున్నారు కదా  .. హ్మ్మ్..  ఔను తిలకించండి!)

 'అది సరేలేవయ్య .. అసలేమిటి సంగతి ఈ కథ లోని భావం అంటే '.. అడిగారు .. కథ లో కథాకమామిషు వుంది కదండీ అందులో కమామిషు తీసివేస్తే మిగిలేది .. మళ్ళి  కథ అంటూ కథ అంటున్నాడు అనుకుంటున్నారా ఏమోలే క్రితం లో ఎవరో అన్నట్టు విన్న పదాన్నే తిప్పి తిప్పి వాయించాడట..  ఇంకెవరు అదేనండి శ్రీకృష్ణదేవరాయల వారి ఆస్థాన కవి సార్వభౌముడు  ఆ..  అతనే అతనే..  మీ బుర్రలో "జేనోన్ ఫ్లాష్" లా వెలిగింది చూసారు..  అదేనండి తెనాలి రామకృష్ణులవారు అతని "మేక-తోక" కదంబం. నాయన .. ఇప్పుడు ఏదో మాంచి కథ చెప్తాను అని ఎదురు చూస్తుంటే రామక్రిష్ణులవారి కథా .. !

రామ రామ కృష్ణ కృష్ణ కాస్త ఓపిక పట్టండి .. ఏది నేనింక మొదలు పెట్టనిదే.. కథ ఏమిలేదండి అలా అని వాస్తావికంగా  వాస్తవం కూడా ఏమి లేదు అందుకే కదా కథ అంటున్నది. 

సరిపోయింది .. ఇక కథ విన్నట్టే .. ( గమనించండి మీరు వినట్లేదు చూస్తున్నారు అదే తిలకిస్తున్నారు )
అదే లేవో కథ అడ్డం తిరిగిందా  లేకా నిలువుగా నిలుచుందా అని సందేహం అదీ ధర్మసందేహం .. ఇంకా మీరిక్కడే వున్నారా కథ అడ్డము తిరగలేదు నిలువుగా నిలవలేదు "నా-మీ" వాదన విని ఎప్పుడో రైలెక్కి కాంచీపురం చేరుకుంది అనట్టు కాంచీపురం లో పట్టు చీరలకా అనే కదా మీరు అడగబొయేది.. ఇంకేం చెప్పమంటారు చీర కోసం కాదండి చిరాకు పరాకు పడకుంటే అసలు సంగతి చెబుతా.. కథ కంచికి చేరుకుంది అంటే..  ఇంకా విడమర్చి చెప్పాలా పోనిలేండి కథ కంచికి చేరిందని చెప్పటానికి కామోసు తన "సిగాన పెసునాంబ" ను వదిలి మరీ పనిగట్టుకు వచినాడు  చూసారా .. మళ్ళి వీడెవడండి కొత్తగా కథలో అని అడిగారు ? కొత్తగా ఎం  చెప్పమంటారు పాతదే సుమండీ అదే బాపుగారి "బుడుగు" ఔను కదు ఇందాక చెప్పింది అదే రాసింది చూసి చూడనట్టే మరిచిపోయాం  కదూ ఔనుఔను బుడగే  కాదు కాదు బుడుగే. 

Popular posts from this blog

Telugu Year Names

My Childhood and Now

మాతృమూర్తి గొప్పతనం