గురుతున్నదా
నింగి అంచుల్లోన కరి మబ్బులే వెలిశాయి
చిటిపొటి పాదాలకే పరుగులు నేర్పుతు
చిందాడిన ఆ సుమధుర క్షణాలు
ఉరుకలేస్తు ఉరుమునే మైమరిపించే కేరింతలు గురుతున్నదా.. గురుతున్నదా..
ఝల్లు ఝల్లున కురిసే వాన తో ఘల్లు ఘల్లున మువ్వలే పలికాయి
వరదలైన వాన నీటిలో పాదాలే నడయాడుతు నర్తించాయి
రంగుల రాట్నం గిర్రున తిరిగే హరివిల్లే రంగులతో విరియగ
మనసే పులకరించి నాట్యమాడిన ఆ సందర్భం గురుతున్నదా.. గురుతున్నదా..