ఆనవాళ్ళు

కన్నుల అంచులలో ఏమున్నది ?
కంట తడి దాచుకున్న కలువ రేకుల్లాంటి కనురెప్పల మాటున
అలజడిని ప్రతిబింబించి ద్రవించిన హృదయపు ఆనవాళ్ళే కదా ఆ కన్నీటి ముత్యాలు
మాటల్లో తెలుపలేని భావమై మెదిలే సంతోషానికి దుఃఖానికి ప్రతిచర్యలు ఆ కంటి చమ్మలు

బాహ్యముగా కాన వచ్చే మనిషిని కనులు మాత్రమె చూస్తాయి
కాని అసలు సిసలు మనిషిని మనసు మాత్రమె చూడ గలదు
ఎందుకంటే మనిషిని నడిపేది మనసులోని భావాలే
భావాలు మనసులో మెదిలే అంతరంగాలే
పలుకే నిలిచే భావ అంతరంగ సరాగాలే
ఆ సరాగాల మాటునా రాగభావావేశ సుమదురాలే 

Popular Posts