మాతృమూర్తి గొప్పతనం

మాతృహృదయమే కోవెలైతే వెలిగే చిరు దీపం
ఒడిసి పట్టుకుని బుజ్జగించే తల్లి మమకారం
కాలమే కదలాడినా మారని వాత్సల్యం
అదే అదే ప్రతి మాతృమూర్తి గొప్పతనం

కని పెంచే సహనశీలి తాను కనికరించే కారుణ్యం
అల్లరి చేసినా మురిపెం చేసేను కదా ప్రతినిత్యం
కదలాడే కన్నుల వాకిలిలో అనునిత్యం
అదే అదే ప్రతి మాతృమూర్తి గొప్పతనం


(నా ప్రాణస్నేహితురాలి మానసపుత్రిక *లమ్* కు అంకితం)

Popular Posts