ఒక్కో ఘడియ కదలాడే వేళ

ఎగిసే అలనా నేను.. సంద్రం సడి చేసే వేళ
ఒడ్డుకు చేరి సైకతపాదం తాకుతాను..!
కురిసే చినుకునా నేను.. మేఘాలు ఉరిమే వేళ
మిన్నుకు భారమై మన్నులో ఒదిగిపోతాను..!!
కదిలే కాలమానమా నేను.. ఒక్కో ఘడియ కదలాడే వేళ
జ్ఞాపకాలుగా మారి కాలగర్భంలో కలిసిపోతాను..!!!

Popular Posts