మనం


మనం ఆడిన  ఆటలు  ఎగ్గొట్టిన  క్లాస్స్లు
మనం పాడిన పాటలు పడిన పాట్లు వేకించిన వెకిలి నవ్వులు
మనం తిన్న తిట్లు చీవాట్లు చీటికి మాటికి పడ్డ ఆవేదనలు
కోపతాపాలు అలిగిన ఆ క్షణాలు ఇంకా అలాగే మన మనస్సులో ముద్రితమై ఉన్నాయి

వ్యంగ్య హాస్యరసాలు వెనక బెంచ్ బింగో లు
 పక్క బెంచ్ హౌసీ లు ముందు బెంచ్ సుడోకు లు
విరగ్గొట్టిన కిటికీ అద్దాలు క్రిస్టల్ బోర్డులు తన్నితే పగిలిన పూల కుండీలు
మనమాడిన క్యారం లు, వాలీబాల్ క్రికెట్లు ఇంకా అలాగే మన మనస్సులో ముద్రితమై ఉన్నాయి

ల్యాబ్ లో  కొట్టేసిన రెసిస్టర్లు జేబులో వేసుకేల్లిన కెపాసిటర్లు
బ్రెడ్ బోర్డు మీద ఎగిరిన ఐ సి లు, రాంగ్ కనెక్షన్ తో కాలిన డి సి మోటార్ ఫుజ్ లు
సౌత్ టూర్ లో చేసిన అల్లర్లు, కేకలు, కోతులతో కరిపించి అరిపించిన ఆ క్షణాలు
కంప్యూటర్ ల్యాబ్ లో చాట్ చేసి దొరికిపోయిన క్షణాలు ఇంకా అలాగే మన మనస్సులో ముద్రితమై ఉన్నాయి

వెంట తిరిగిన ప్రేమించని వాళ్ళు, ప్రేమించట్లేదన్న వెంట తిరిగి పెళ్లి తతంగం వరకు తెచ్చిన స్నేహాలు
మనం ఇచ్చిన సెమినార్ లు, పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాం లో నిద్రించిన ఆ క్షణాలు
మన స్నేహితులకి ప్రాక్సీ ఇచ్చి పట్టుబడి నవ్వాలో ఏడవాలో తెలియక సతమతమయ్యే సమయాలు
పెట్టిన పేర్లు, విసిగెత్తిన మనసులు, బాదతాప్త హృదయాలు, కాంటీన్ లో శాండ్విచ్ తో పాటు నాలుగు కబుర్లు
ఇంకా అలాగే మన మనస్సులో ముద్రితమై ఉన్నాయి

ఇంటర్బ్రాంచ్ ప్రేమలు, ఎదురుపడితే మన గుండె సవ్వడిని తలపిస్తూ పక్కనే రైలు పరుగులు
ఎంత చూసిన తనివి తీరని మొహాలు, క్లాస్ మధ్యలో లెక్చరర్ కు దొరికి 'బుక్' ఐన సందర్భాలు
లెక్చరర్ల లవ్ స్టోరీలు, వాటిని తీసిపోని విధంగా క్లాసు లో మొదలైన 'ప్రేమ పాఠాలు'
ఈజీ గ ఇరికించి ముఖం చాటేసిన వైనాలు, విడిపోతున్నప్పుడు ఒక్కొక్కరి కంటినుండి రాలిన అశ్రువులు
ఇంకా అలాగే మన మనస్సులో ముద్రితమై ఉన్నాయి  

Popular posts from this blog

Telugu Year Names

లోలోపల