కలలు అలలు

వన్నెల వాసంతాలు ఎదురు చూస్తున్నాయి కొఇల రాగాలకి ఎగసి

కాని ఎందుకో నాకే తెలియని ఆవేదన ఏదో నన్ను వెంటాడుతుంది

ఈ కలవరింతల లో ఎం మాయో ఏమో నన్నే నేను మరిచిపోయా...

ఎందుకో అసలెందుకో

కలలు చిమ్మ చీకటిలోనే వస్తాయన్నది నిజమే కాని

వాటికి వెలుగు చూపించక పోతే అవి ఆ చీకటిలోనే కనుమరుగై పోతాయి

ఎన్నటికో ఒక కల వచ్చింది నన్ను మైమరిపించింది కాని ఏమో ఏమైందో

ఆ కల వేకువ చూడక ముందే కన్నీటి సంద్రం లో ఉప్పెన లా మారి ఆవిరైపోయింది

ఇదే కళల అల లేక అలల కల ... ఏమో ఇది కాని ఏదో వింత అనుభూతి ఎనిమిదేళ్ల ఓ తియ్యని బాధ

నేడు కరిగిపోతుంది కరిగే కొవ్వోతిల ఆ చిమ్మ చీకటిని వీడాలని అనుకోని ...!

ఈ కన్నీరు కారి కారి మనసు కి ఓ ఆహ్లాదాన్ని గుండె బరువుని దించింది.

ప్రియ ... నిన్ను నేను మరిచిపోవలనుకుంటున్న... ఇది నాకేమాత్రం సబ్బాబు కావట్లేదు...

శ్రీ...!

Popular Posts