Jeevana Paramaartham

వెండి వెన్నెల్లో జాలువారే అందం చూసే కంటి కన్నా పరితపించే మనసు కు హాయినిస్తుంది
అలలు కెరటాలుగా ఎగసి పడిన దానిలోని భావుకత నిరాడంబరత మంచి భావన తెలుపుతుంది
ఎడారి లో మండే ఇసుక రేణువులు సైతం చల్లారి చీకటిలో వెన్నెల తో పోటి పడీ మరి చల్లబడుతుంది

కోపావేశం మన దిశ నిర్దేశాలపైనే ఉంది బంధాన్ని నిలుపుకున్దామన్న దాన్ని తెంచే దామన్న వేరెవ్వరు అడ్డు రారు కాని పశ్చాతాపాగ్ని లో మన మనసు కాకవికాలం అయ్యే కొద్ది అందులోని మన కపట స్వార్థం బైట పడుతుంది

రాయయిన మంట లో కరిగించి వన్నె తెస్తే బంగారం అవుతుంది దాని విలువ పెరుగు తుంది. ఏమో రేపు కూడా ఈ విలువలేని మనసుకు కూడా అంతటి విలువ వస్తుందో ఏమో . నిన్నటి ఆ చిన్నరే రేపటి ఓ ఉన్నత పురుషునిగా  వెలుగులు పంచ వచ్చును కదా . మోడువారిన కొమ్మ మీద వాలాలంటే పక్షులు జంకుతాయి అదే పచ్చని చివురులు తొడిగిన చెట్టు మీద వాలని పక్షి లేదు.

ఉన్ననాళ్ళు బంధాన్ని ఆప్యాయతని అనురాగాన్ని నిస్వార్థ తత్వాన్ని నిరాడంబరతను నిజాయతి గా అందరికి పంచు. నువ్వు పంచిన ఆ మంచితనమే రేపు ఓ చెట్టు గా మొలచి నిన్ను ఆదరించక మానదు. మనిషికి వెల కట్టలేం కాని ఆదర్శ ప్రాయం గా ఉంటె ఆ మనిషి మహోన్నత శికరాలను తాకగలడు నిబ్బద్దతతో

Popular posts from this blog

Telugu Year Names

My Childhood and Now

మాతృమూర్తి గొప్పతనం