ఇదేం విడ్డురం

ఎక్కడో ఉన్న చల్లని వెండి చంద్రుని పై నీరుందని తెలిసింది
పక్కనే ఉన్న మనిషిని గురించి తెలియదు మనకి ఇదేం విడ్డురం

అందని ఆకాశం వైపు పరుగులు తీస్తున్నాడు మానవుడు
అందిన ప్రకృతిని మాత్రం పట్టించుకోవడం లేదు ఇదేం విడ్డురం

లోహపు యంత్రాలనే పని ముట్లుగా చేసుకున్నాడు మనిషి
హృదయమనే యంత్రాన్ని పట్టిచుకోవడం లేకనే జబ్బులు కొని తెచ్చుకుంటున్నాడు ఇదేం విడ్డురం

తన హస్తవాసి తో ప్రపంచాన్ని జయించగల శక్తి తానని తెలిసిన మరిచి
తనని తానూ చిన్నపుచుకుంటున్నాడు  మనిషి ఇదేం విడ్డురం

అంగారకుడి లోపల ఏమున్నదో పసిగట్టగలిగాడు మనిషి తనకు దగ్గర వాళ్ళ గుండె చప్పుడు మాటున దాగివున్న ఆప్యాయత అనురాగాన్ని మాత్రం మరిచిపోతున్నాడు ఇదేం విడ్డురం
 

Popular posts from this blog

Telugu Year Names

లోలోపల