ఎలక్షన్
ఎలక్షన్లు ఎలక్షన్లు భావి భారతావని ప్రగాతికిదే తోలి మెట్టు
ఎలక్షన్లు ఎలక్షన్లు కుళ్ళు కుతంత్రాలన్ని ఇక పక్కనబెట్టు
ఎలక్షన్లు ఎలక్షన్లు పరిగెత్తుకు రా వోటాయుధం చేత బట్టు
ఎలక్షన్లు ఎలక్షన్లు మాయమాటల మోసాల పనిపట్టు
ఎలక్షన్లు ఎలక్షన్లు వోటు వేసి నీ ఖ్యాతిని సమాజం లో నిలబెట్టు
ఎలక్షన్లు ఎలక్షన్లు నీకు నచ్చినట్టు నచ్చిన వారికే పదవిని కట్టబెట్టు
ఎలక్షన్లు ఎలక్షన్లు వోటు మీట నొక్కి భారతావనికి సలాం కొట్టు
ఎలక్షన్లు ఎలక్షన్లు రాజకీయ మార్పునకు నాంది పలుకుతూ వోటు వేసి ఆదరగొట్టు