నన్ను చూడు ఏం కనిపిస్తుంది?

నన్ను చూడు ఏం కనిపిస్తుంది ?
అలల మాటున రేగిన అలజడి కనిపిస్తుందా 
లేకా వాటి నడుమ లెక్కకు మించిన నీటి బొట్టు కనిపిస్తున్నదా
చంద్రుడు ఉన్న లేకున్నా నేనెప్పుడు కాలం వొడిలో ఊయలూగే అలనే 
కంటికి కునుకంటూ లేక ఓలలాడించే సాగర ఘోషనే 

నన్ను చూడు ఏం కనిపిస్తుంది?
వెలుగులు కోల్పోయి చీకటి అలుముకున్న కాలం కనిపిస్తుందా 
లేకా రేపటి వేలుగులకై వేచి చూసే నిశి రాతిరి కనిపిస్తున్నదా 
చంద్రుడు ఉన్న లేకున్నా నేనెపుడు పగటికి కాలాన్ని వెళ్లదీసే తిమిరంధకారాన్నే 
కాలం వొడిలో నీకు హాయి కలిగించి రేపటి వేకువకై నిన్ను చేర్చే రాతిరినే 

నన్ను చూడు ఏం కనిపిస్తుంది ?
వంకర్లు తిరిగి భావం ఏదో మరిచి ఒంటరిగా మిగిలి ఉన్న అక్షరం కనిపిస్తుందా 
లేక తనలో దాగి ఉన్న శక్తి కై వేచి చూసే భావం ఒరవడి కనిపిస్తున్నదా 
ఇటుకటు అటుకిటు మార్చి మార్చి ఓ భావానికి శ్వాస ఇచ్చిన అక్షరాన్నే
నీ మదిలో దాగిన భావాలను అక్షరరూపం లో పొందు పరిచే కవిత్వాన్నే 

నన్ను చూడు ఏం కనిపిస్తుంది?
ఆమడ దూరం లో ఉన్న ఆకాశం పాదం కింద ఉన్న భూమి కనిపిస్తుందా 
లేకా ప్రకృతిలో ఇమిడి ఉన్న జీవరాశికి ఊపిరులు ఊదే పంచభూతాల గనిలా కనిపిస్తున్నదా 
లోకాన్నే తన గుప్పిట బంధించి మనిషి ఉనికిని చాటే  ప్రాణ వాయువును నేను 
నీ ఊపిరి ఉచ్చ్వాస నిశ్వాస లో బంధీ అవుతూ నీలోని ప్రాణానికే ప్రాణం నేను ప్రకృతిని 

కైలాసగిరి నుండి ఋషికొండ భీమ్లి వ్యూ

Popular Posts