శ్రీఅనిశ

గత పాతిక రోజులుగా
నీ తలపులలో విహరిస్తున్నా
నా నిన్ను మరల హత్తుకోవాలని
నిదుర మరిచి కలత చెంది పరితపిస్తున్నా

నీ ఆ అధరాలలో పనసపండు సువాసన
నీ మేను పులకింతలను ఆస్వాదిస్తున్నా
మన కంటి వెలుగు చూచూలు పసి ప్రాయపు నవ్వులకై
కనురెప్పల అలికిడిలో మమేకమై వేచి చూస్తున్నా

నీ హృద్మందిర లయగతులలో సవ్వడి
ఉచ్వాస నిఃశ్వాసలతో పోల్చి చూస్తున్నా
మన కోపోద్రికాలన్ని ఛిన్నాభిన్నమై
నా నిన్ను నీ నన్ను మన సానిహిత్యపు  వెచ్చదనాన్ని చవిచూస్తున్నా

నా సగభాగమైన నిన్ను
అనుక్షణం ఆరాధిస్తున్నా
నా పేరులో సగం నీ పేరులో సగం
ఉనికిలో మాత్రం నువ్వు నేను ఎల్లపుడు మనం

నా జీవితభాగస్వామి అనితకు మనస్పూర్తిగా అంకితమిస్తు
దసరా దీపావళి కలగలసి దాదాపు నెలరోజుల ఆటవిడుపు
శ్రీధర్+అనిత=శరణ్య కలగలసి ఏ క్యూట్ ఫ్యామిలి
మనమందరం సుఖశాంతులు సిరిసంపదలతో ఎల్లకాలం వర్ధిల్లాలి

Popular posts from this blog

Telugu Year Names

My Childhood and Now

మాతృమూర్తి గొప్పతనం