అబ్బాయికి ఆప్యాయతతో

 తెలుసా హర్షా..

లోకం చాలా పెద్దది. అంచేతనే అంత మన వారే అనే అపోహా కు లోను కాకూడదు. కొందరు ఎటువంటి వారంటే.. వారే కావాలని నెట్టేసి.. అరేరే పడ్డావా.. లే.. అంటూ నాటకీయత ప్రదర్శిస్తారు.. మరి కొంత మంది ఐతే పావలా సాయానికి ఐదు రూపాయలను అడిగి మరీ బలవంతంగా లాక్కుంటారు.. 

మరో విషయం ఏమంటే కన్నా..

నువ్వు ఎవరికైనా సరే మంచి చేసి చూడు, మర్యాద ఇచ్చి చూడు.. కొందరు మంచి మనసుతో ఆశీర్వదిస్తారు. మరి కొంత మంది ఐతే నువ్వు చేసిన మంచిని కావాలనే కుట్రతో మరచిపోతారు.. తెలుసో తెలియకో సంభవించే తప్పిదాలను గుర్తు పెట్టుకూని కావాలనే నోరు పెద్దది చేసుకుని అరుస్తూ ఉంటారు. అటువంటి వారికి మర్యాద ఇస్తే దానిని అలుసుగా అదను చేసుకుని తలకెక్కి తైతక్కలాడిస్తారు..

తదుపరి..

ఎవరిని అంతగా పట్టించుకోనవసరం లేదని మీ నానమ్మ తాతయ్యలు నాతో చెబుతూనే ఉంటారు.. మా నానమ్మ తాతయ్యలు సైతం నాకు ఇదే చెప్పినారు కూడా..

 బాబు.. ఒక్క విషయం 

ఇవి మాత్రం నువు ఎపుడూ గుర్తుంచుకోవాలి 

* ఏ బంధం శాస్వతం కాదు, ఐతే అందులో కొన్ని బంధాలు మన జీవితానికి కీలకమైనవి.. అమ్మ: జన్మ ఇచ్చి మనకోసం ఆరాట పడే దేవత.. నాన్న: మన ఉనికికై, ఉన్నతికై మన బాగుకోరే వారిలో మొదటి స్థానం ఎపుడు నాన్నదే.. రెండవ స్థానం అమ్మది. ఎంత వద్దనుకున్నా, కాదనలేని స్వచ్ఛమైన ప్రేమ ఆప్యాయత ఒకరిది, సహనశీలత త్యాగనిరతి మరొకరిది. వీరిద్దరి తరువాతే ఎవరైనా


ఇట్లు మీ నాన్న ౼ శ్రీధర్

Popular posts from this blog

Telugu Year Names

లోలోపల