జీవిత కాల చక్రం

అమ్మ ఒడిలో పాపడుగా స్వేచ్ఛా.. ఐతె కాలు, చేతులు ఆడించటం వరకే తతిమ వన్ని ఉంగాలే

ఆడుకునే వయసులో.. పక్క వాడి బొమ్మలు నీకెందుకు నీకున్నవి చాలు ఆడుకో అంటారు లోకులు

చదువుకునే వయసులో.. అందరికి నూటికి ఎనభై రావాలని రాత్రింబవళ్ళు ఒక్కటి చేయమంటారు

యవ్వనంలో.. ఉద్యోగముంటేనే ఆలిని, చూలుని చక్కదిద్దుకోగలవని ఉద్యోగ వేటలో తలమునకలు

పెళ్ళి తంతు ముగిసేక.. ఇంక ఎన్నేళ్ళు పిల్లలేకుండ.. ఓ ప్లాన్ పద్ధతి తో మసులుకోండని బోధ

పిల్లలు పుట్టినాక.. పసి గుడ్లు పెరుగుతున్నారు.. జీతభత్యాలు సరితూగేలా అలవర్చుకోవాలని హితువు

పిల్లలు వయసుకొచ్చాక.. పెళ్ళి పేరంటాలు, ఉద్యోగ బాధ్యతలు అప్పగించే సరికి ముప్పావు జీవితం స్వాహా

సతిమణితో జీవితం ఆల్బమ్ చూసుకుంటే సంతోషంగా గడిపినవి నెలల వ్యవధే ఐనా సంతృప్తి

ఇహ వయసు మీరినాక పంపకాల పేరిట ఎవరెవరిని మోసమో, దగో, కుట్రో పేరిట నయవంచన

అందరికి అన్ని ఇచ్చి నడుము వాల్చే సందర్భాన తాను ముందో నేను ముందో అనే దిగాలు

కాటికి కాలు చాచి చితిలో కాలేనాటికి ఏది నీది ఏది నాది, బంధాలు, బాంధవ్యాలు, ఆస్తి పాస్తులు, పిల్లలు, హోదాలు

వెరసి ఇదే కాల చక్ర భ్రమిత కలియుగ జీవన ప్రమాణం..తీరిక లేక ప్రేమ లేక అంతునా నిర్యాణం

Popular Posts