అలిగావా.. ఐతే విను
తీరిక వేళలో అలగ వచ్చు
ఒక్క సారి ఈ క్షణం దాటితే మరల రాదు
కోపగించుకున్నావా.. ఐతే విను
తప్పు నాదైనా నీదైనా అవ్వ వచ్చు
మానవులం మనలో మనకే విసుగు
కాలం ఎంతో లేదు తలుచుకున్నా జ్ఞాపకమే
ఒక్కసారి ఈ క్షణం దాటినా బంధం తిరిగి రాదు
మాటరాక మౌనముద్ర దాల్చావా.. ఐతే విను
మాటలకి ఆనకట్ట వేసినంత మాత్రానా
మనసులో ఉన్న భావన ఎపుడు చెదిరిపోదు
ఈ క్షణం నీకు కలిగిన వేదన కూడా సమసిపోతే
మాటలు వాటికవే మెదులుతాయి
రేపు నువు చెప్పాలనుకున్నా నీ మనసు పలికే
భావాలను ఏకరూపు దాల్చలేక నీలోనే కుమిలిపోయేకంటే
ఒక్కసారి మౌనముద్ర వీడి మనసు విప్పి మాటాడు