నాలుగు దశాబ్దాల కాలం నా జీవితంలో గడిచిపోయాయి మొదటి దశకం ఎలా ముగిసిందో గురుతే లేదు చిన్నతనం కదా రెండవ దశకం నా జీవితం లో కీలక మజిలికి దారి చూపింది మూడవ దశకం నా జీవితం లో పెను మార్పులు సంభవించాయి నాల్గవ దశకం పూర్తి కాగానే నా భార్య పలుకు: నువ్వేమి చంటి పిల్లాడివి కాదు పుట్టిన రోజులు జరుపుకోవటానికి. కొత్త బట్టలు వేసుకుంటే నీకు మర్యాద దక్కదు. ముసలాడివి కావటానికి ఎంతో సమయము లేదు, సంబరం ఒకటా నీకు..! అపుడు నాకు అనిపించింది.. నలభై ఏళ్లకే ముసిలివాడినా దానికి కూడా ఏదో ఒక రోజు ముసలితనం రాక మానదు. ఐనా తప్పు నాది కూడా ఉందిలే తనని గారం చేయటం ప్రతిఫలంగా తాను నన్ను దూరం పెడుతూ వస్తోంది..! దాని మూలానా ౭ ఏప్రిల్ ౧౯౮౫ ఒక గుర్తుగా మిగిలిపోనుంది! అది నేను పుట్టిన రోజు మరి. నేను తనకి సౌభాగ్యాన్ని ఇస్తే తాను మాత్రం నా సంతోషాన్ని దూరం చేసేసింది. పిల్లల యోగక్షేమాల మూలానే బ్రతుకుతు తనని సుమంగళిగా సమాజంలో పరిచయం చేస్తున్నా
మదిని సుతిమెత్తగా మీటే భావాల మజిలీ