Posts

Happy Deepawali

ఈ చక్కని దీపావళి మన ముంగిట దీపమాలిక ల మన ప్రేమానురాగాలను ప్రసరింప చేయాలని దుఖం కలహం కల్మషం బాధ అనే నిశినుంది జ్ఞానజ్యోతులు తిమిరాంతకాలు గ మారి సంతోషం సుఖ సుఖ్యాలను మన అందరికి ఇవ్వాలని ఆశిస్తూ ... కావ్యాంజలి వీక్షకులకు కవి ప్రేమికులకు నా తరపున వెయ్యి వెలుగులు ప్రసరింప చేసే దీపావళి శుభాభినందనలు. Wishing you all a Very Happy ,Bright and Safe Deepawali %%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%~* ((@))~* Sridhar Bukya

చలి తెరలు

Image
Image Courtesy: The Hindu చేతులు చల్లగా మారాయి .. చందురుడు నిషి రాత్రి లో మసకగా కనిపిస్తున్నాడు ఉదయం మంచు పల్లకి లో తేలియాడుతూ ఉంది ... కళ్ళకు కట్టినట్టు ఆ మేఘమాల నేడు పొగ మంచునే అచ్చాదానంగా చేసుకొని ఇల పై ఇలా వాలినట్టు ఎటు చూసిన పొగ మంచు తెరలు అల్లుకున్నాయి కమ్మని ఈ చల్లదనాన్ని ఆస్వాదిస్తూ అలా చక్కర్లు కొడుతూ ఉంటె ఆ చలి లో చలి మంటలు వేసుకుని పోగేసుకున్న మనుషులు తరాస పడుతారు . వేకువలో కూడా చల్లగా చేసే శీతాకాలం ఇలా మనముందు ప్రత్యక్షం అవుతుంది ... చల్లని గిలిగింతలు పొగమంచుల కవ్వింతలు చలి మంటల పరిచయాలు ... నిద్రలేచిన మంచం దిగడానికి వీలు పడని  చలి తెరలు ... మంచులో ప్రయాణాలు ఆహ్లాదభరిత వాతావరణం లో చేసే విహార యాత్రలు మన అందరికి ఏంటో నచ్చే రోజులు ఇవే సుమండీ ...! చలి తెరలు ఋతు రాగాలు చల్లదనం లో వెచ్చదనం కోసం పడే పాట్లు హాయిగా మురిపెంగా వినోదంగా అనిపించే ఆ మధుర క్షణాలు ... చలి తో ఆత్మీయ అనురాగాలు ప్రక్రుతి తల్లి మనకు అందించిన అపురూప బహుమానం.

দূর্গা নাভারাত্রী পারভ

Image
মা দূর্গা দেবী সকল ভাক্তানি শুভ কারু মা দূর্গা নাভারাত্রী পারভ বাংলা হাবড়া কলকাতা অক্টোবর ২৪, ২০১২ যাই মা কালি ভাদ্রকালি শ্রীধর ভুক্য়া

Vasantam

ముత్యాల చినుకులు మోసుకొచ్చిన మేఘమా వెన్నెల వాసంతాలు విరబూయించిన వేకువ కొఇల గానాలతో అలరారిన వసంతమ చివురులను తాకి తాకనట్టుగా పరిమళాలు వెనువెంట మోసుకొచ్చిన చల్లని సాయంత్రమ

Ninna Nedu Repu

నిన్న ఓ కరిగిపోయిన కమ్మని కల నేడు ఓ చెదిరిపోని కర్తవ్యాల వల రేపు ఓ మధురనుభుతినిచ్చే వెల్లువ ఆ ప్రవాహం ఎప్పుడు మన ఎదుటికి రానే రాదు నిన్నటి ఆ స్వప్నాన్ని ఎన్నాలని గుర్తుచేసుకు ఉంటాము రేపటి మన ఆశలకి ఆశయాలకి నేడు ఓ పునాది అవ్వాలి నిన్నలో జరిగిన వన్ని మన మంచికని అనుకోని రేపటికి ముందు అడుగువేసుకు పోవడమే మానవ లక్షణం చిరునవ్వు చెదరని మోమును చూస్తూ ఉంటె మనసు ఉప్పొంగి ఉల్లాసంగా పరుగులు తీస్తూ ఉంటుంది అదే మన కళలను సాకారం చేసే విజయ వారధి మన రేపటికి మనతో ఎప్పటికి నిలిచి పోయే పెన్నిధి

దొంతెర

అల నేను నిదురించడానికి ఉపక్రమించానో లేదో.. ఉన్నటుండి ఏవో జ్ఞాపకాల దొంతెరాలు నా కనుల ఎదుట సాక్షాత్కరించాయి.. నిన్నటి ఆ రోజులు ... ఆ ముభావమైన స్వభావాలు ... భావం లేని రాగాలు ... రాగం లేని రాగ ద్వేషాలు ... ద్వేషం లేని కల్మషాలు... కల్మషం లేని ఆప్యాయతలు... ఆప్యాయత మరిచిన ప్రేమలు... అన్ని.. అల అల ... ఇన్నేళ్ళలో ఎప్పుడు అనిపించలేదు నాకెపుడు కాని తోలి సారిగా అప్పుడు ఎందుకు అనిపించిందో ... నాకైతే అసలు తెలియనే తెలియదు.. తెలిసి తెలియని వయసు లో మొదలయ్యేది ఒకటి ఉందని తెలిసిన ... ఆ భావన అదేనా కాదా అని మనసు లో సమస్య పూరణం చేసుకునే ఇప్పటి లాంటి రోజులు కావవి ... ఎప్పుడు లేనంతగా ఎందుకో నాకు అల అనిపించింది ... కాని చెప్పడానికి మాటలు చాలక ... విన్నవిన్చుకోవడానికి మనసు ఒప్పక అంతర్మథనం చేసుకున్న క్షణాలవి ... రోదసిని దాటి రోడించాలనిపించిన ఎందుకో నాకప్పుడు ఏమి అనిపించలేదు .... ఆ భావన కలిగి నేటికి పన్నెండేళ్ళు సంపూర్ణమైన ఇప్పటికి మొగ్గ తొడిగిన కలువ రేకుల్ల ... హొయలు పోతున్న జలపాతం ల .. ఆకాశాన మెరిసే తార ల మిణుక్కు మిణుక్కు మంటూ ఓ చల్లని దీపం ప్రజ్వలిస్తుంది. నా కంటికి ఆ ఉప్పెన కూడా మానవత్వం కలిగిన మనిష

Raagaalu

ఎగిరే గాలిపటాలు మనసులోని ఆలోచనలు పూచే పువ్వులు మది లో దాగిన భావాలు నిషి రాత్రులు ఉదయించే రేపటికి స్వాగతం పలికే ఎర్ర తీవచిలు వెన్నెల కాంతులు కల్మషం లేని బంధానికి ప్రతీకలు వెచ్చని సూర్య రశ్మి ఆనందానికి ఆనవాళ్ళు పక్షుల కిలకిలలు రాబోయే మంచి రోజులకు నిలువెత్తు నిదర్శనాలు